ఎర్ర టమాటాలు-పావుకేజి,
పంచదార-కప్పు
నెయ్యి-అరకప్పు, జీడిపప్పు,
బాదంపప్పు-రెండూ కలిపి పావు కప్పు
బొంబాయి రవ్వ-అరకప్పు,
యాలకులపొడి-ఒక టేబుల్‌స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా టమాటాలను ఉడికించి గుజ్జు తీయాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. ఆ తరువాత అదే బాణలిలో బొంబాయిరవ్వను వేయించాలి. మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి బొంబాయిరవ్వ కలపాలి. ఇది దగ్గరపడ్డాక టమాట గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలపాలి. చివరగా యాలకులపొడి చల్లితే చాలు. టమాటా హల్వా సిద్ధం.