సగ్గుబియ్యం : ఒక కప్పు
పాలు : 4 కప్పులు
పంచదార : ఒక కప్పు
జీడిపప్పు పలుకులు : 15
కిస్ మిస్ : గుప్పెడు
ఏలకులు : 6(పొడి చేసుకోవాలి)
తయారుచేసే పద్ధతి :
ముందుగా సగ్గుబియ్యాన్ని ఆరు లేక ఏడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్నని మంటఫై ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఉడికిన తర్వాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి. తర్వాత ఒక చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి వేయించాలి. ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి కలిపి దించుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక