ఉసిరికాయలు - ఐదు,
పాలు - రెండు కప్పులు,
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలు - ఒక్కోటి పది చొప్పున,
యాలక్కాయ పొడి - చిటికెడు,
జాజిపొడి - కొద్దిగా,
తేనె, నెయ్యి - తగినంత
తయారీ:
- ఉసిరికాయల్ని కడిగి ఆవిరికి ఉడికించాలి. తరువాత గింజలు తీసి ముక్కలుగా కోసి వాటిని తేనెలో గంట పాటు నానపెట్టాలి.
- బాదం, జీడిపప్పుల్ని నీళ్లలో నానపెట్టి మెత్తటి గుజ్జులా చేయాలి.
- పాలను కాగపెట్టి బాదం, జీడిపప్పుల గుజ్జు, పంచదార వేయాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు తేనెలో నానపెట్టిన ఉసిరి ముక్కల్ని వేయాలి. కొన్ని నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేయాలి.
- తరువాత యాలక్కాయపొడి, జాజికాయ పొడి వేయాలి. చివర్లో నెయ్యి వేడిచేసి ఎండుద్రాక్షల్ని వేగించి పాయసంలో వేసి బాగా కలిపి తినేయడమే.
- వగరుగా, పుల్లగా ఉన్న ఉసిరికి పాలు, పంచదార కలవడం వల్ల వచ్చే రుచి మిగతా పాయసాలతో పోలిస్తే కాస్త వెరైటీగా ఉంటుంది.