
గుమ్మడికాయ గుజ్జు - కప్పు
మైదా - ఒకటిన్నర కప్పులు
దాల్చిన చెక్క పొడి - టీస్పూన్
బేకింగ్ పౌడర్ - టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
ఉప్పు - అరటీస్పూన్
అల్లం పొడి - పావుటీస్పూన్
పంచదార - ఒకటిన్నర కప్పులు
వెనీలా ఎసెన్స్ - టీస్పూన్
నూనె - ముప్పావు కప్పు
చాక్లెట్ చిప్స్ లేదా చాక్లెట్ బార్ తురుము - 125 గ్రా.
కోడి గుడ్లు - 4
తయారుచేసే పద్ధతి:
- ఓవెన్ ను ముందుగా 180 డిగ్రీల సెంటిగ్రేడ్ కు వేడి చేసుకోవాలి.
- తరువాత ఓవెన్ లో పెట్టె ఓ పాన్ లేదా గిన్నెకి వెన్న రాసి పెట్టుకోవాలి.
- చాక్లెట్ చిప్స్ లేదా చాక్లెట్ బార్ తురుముని ఓ గిన్నెలో వేసి, ఆ గిన్నెని వేడినీళ్ళ మీద పెట్టి అది కరిగే వరకు స్పూన్ తో కలుపుతూ ఉండాలి. కరిగిన చాక్లెట్ ను పక్కన పెట్టుకోవాలి.
- ఓ గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, అల్లం పొడి, దాల్చిన చెక్క పొడి వేసి అన్నీ కలిసేలా స్పూనుతో కలపాలి.
- మరో గిన్నెలో గుడ్ల సోన వేసి బీట్ చెయ్యాలి. తరువాత పంచదార, నూనె వేసి బాగా కలిసేలా రెండు నిముషాలు బీట్ చేయాలి. ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జు, వెనీలా ఎసెన్స్ వేసి మెత్తగా అయ్యేటట్లు ఐదు నిముషాలు గిలక్కొట్టాలి.
- ఒక స్పూనుతో ముందుగా కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమాన్ని రెండు లేదా మూడు విడతలుగా గుడ్డు మిశ్రమంలో వేసి కలపాలి. మరీ ఎక్కువగా కలిపితే బ్రెడ్ గట్టిగా వస్తుంది. అందుకే నెమ్మదిగా కలపాలి.
- ఈ బ్రెడ్ మిశ్రమాన్ని పాన్ లో వేసి దానిమీద ముందుగా కరిగించి పెట్టుకున్న చాక్లెట్ ను వేయాలి. ఓ చిన్న చాకుతో ఎనిమిది ఆకారంలో గీస్తే చాక్లెట్ లోపలకు దిగుతుంది. ఇప్పుడు ఈ పాన్ ను వేడి చేసిన ఓవెన్ లో పెట్టి 55 నుండి 60 నిముషాలు బేక్ చేసి తీయాలి. ఐదు నిముషాలు చల్లారాక కట్ చేసుకోవాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం