బియ్యం : ఒక కప్పు
పెసర పప్పు : ఒక కప్పు
పాలు : ఒక కప్పు
పొడి చేసిన బెల్లం : 3 కప్పులు
నీళ్ళు : రెండున్నర కప్పులు
జీడిపప్పు : తగినంత
ఎండు ద్రాక్ష : తగినంత
యాలకుల పొడి : తగినంత
నెయ్యి : తగినంత
కుంకుమ పూవు : చిటికెడు
తయారుచేసే పద్ధతి :
ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి పెసరపప్పును కాసేపు వేయించాలి. తర్వాత వేయించిన పెసరపప్పు, బియ్యం, పాలు, రెండు కప్పుల నీళ్ళు పోసి అన్నంలా ఉడికించుకోవాలి. అంతలోపు ఇంకొక గిన్నె తీసుకొని ముప్పావు కప్పు నీళ్ళు పోసి బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. మట్టి ఏమైనా ఉంటే పోయేందుకు వడకట్టి మళ్లీ సన్నని సెగపై పెట్టి, చిక్కబడే దాక ఉంచాలి. తర్వాత దీనిలో పెసరపప్పు మిశ్రమాన్ని మెల్లగా తిప్పుతూ కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ మీద నుండి దించేసి వేడి నెయ్యిని, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలపాలి. దీనిపైన యాలకుల పొడి, కుంకుమ పూవు కొంచెం చల్లుకోవాలి. కావాలంటే జాజి పొడి కూడా వేసుకోవచ్చు.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ