పెరుగు - రెండు కప్పులు;
చల్లటి పాలు - 2 టేబుల్ స్పూన్లు;
కుంకుమపువ్వు - చిటికెడు;
పంచదార - అరకప్పు;
జాజికాయ పొడి - చిటికెడు;
ఏలకులపొడి - చిటికెడు;
బాదంపప్పులు - 2 (గార్నిషింగ్ కోసం)
తయారుచేసే పద్ధతి :
- (గడ్డపెరుగు లేకపోతే, ఇంట్లో ఉన్న పెరుగును ఒక వస్త్రంలో వేసి మూట కట్టి, సుమారు నాలుగైదు గంటలు వేలాడదీయాలి. నీరంతా పోయి, గట్టి పెరుగు మిగులుతుంది)
- చిన్నపాత్రలో పాలు తీసుకుని, స్టౌ మీద ఉంచి గోరువెచ్చన చేసి, కిందకు దింపి, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన ఉంచాలి.
- మరొక పాత్రలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి.
- రెండూ బాగా కలిసేలా చిలకాలి.
- కుంకుమపువ్వు జతచేసిన పాలు కలపాలి.
- ఏలకులపొడి జత చేయాలి.
- గ్లాసులలో పోసి, బాదంపప్పులతో, కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.