అటుకులు - పావుకేజీ
చక్కెర - పావుకేజీ
నెయ్యి - 100 గ్రా.
పాలు - పావు లీటర్
జీడిపప్పు, కిస్ మిస్ - పావుకప్పు
యాలకుల పొడి - అరచెంచా
కేసరి రంగు - చిటికెడు
పచ్చ కర్పూరం - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
- అటుకుల్ని ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని వంపేసి అటుకుల్ని ఓ పళ్ళెంలోకి తీసుకొని ఆరబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి, చెంచా నెయ్యి వేడి చేసి, అటుకుల్ని వేయించుకొని పెట్టుకోవాలి. తరువాత మరో చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ లను కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఓ గిన్నెలో పాలు తీసుకొని మరిగించి మంట తగ్గించి అటుకులు, చక్కెర వేయాలి. అటుకులు చక్కెర బాగా కలిసాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్ మిస్ లు, యాలకుల పొడి, కేసరి రంగు, పచ్చ కర్పూరం కలపాలి. ఆ తరువాత మిగిలిన నెయ్యిని కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. కేసరి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ కట్టేసి ఓ గిన్నెలోకి తీసుకుంటే చాలు. వేడివేడి అటుకుల కేసరి సిద్దం.
మూలం : ఈనాడు వసుంధర