గోధుమరవ్వ-రెండు కప్పులు,
పెసరపప్పు-అరకప్పు
క్యారెట్ తురుము-అరకప్పు,
జీలకర్ర-అరచెంచా
పచ్చిమిర్చి-రెండు (సన్నగా తరగాలి),
అల్లం-చిన్నముక్క(సన్నగా తరగాలి)
నెయ్యి-మూడు చెంచాలు,
ఉప్పు-తగినంత
నీళ్లు-నాలుగు కప్పులు
తయారుచేసే విధానం :
- పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి.
- బాణలిలో నెయ్యి కరిగించి అల్లం,పచ్చిమిర్చి జీలకర్రను వేయించుకోవాలి. అందులో నీళ్లు పోసి వెంటనే తగినంత ఉప్పు వేసేయాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు గోధుమరవ్వ, పెసరపప్పు, క్యారెట్ తురుము ఒకదాని తరువాత ఒకటి చేర్చాలి.
- రెండు, మూడు నిమిషాలయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. రవ్వ ఉడికాక దింపేయాలి.
- చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండ్రాళ్లలా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మళ్లీ ఆవిరిమీద ఐదు నుంచి పదినిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. గోధుమ ఉండ్రాళ్లు సిద్ధం.