సగ్గుబియ్యం (సాబూదాన్) - అరకప్పు,
పాలు - ఏడు కప్పులు,
పంచదార - 2 కప్పులు,
క్యారట్ తురుము - కప్పు,
బాదంపప్పులు - పావు కప్పు (దోరగా వేయించి పొడి చేయాలి),
ఏలకుల పొడి - టీస్పూను,
కుంకుమపువ్వు - చిటికెడు,
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు, కిస్మిస్ - గార్నిషింగ్కి సరిపడా
తయారి:
- సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి
- పాలను మరిగించాలి
- సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి
- బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లు వేయించి తీసేయాలి
- ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి
- మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి
- వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి.