పొట్లకాయ ముక్కలు - 2 కప్పులు (సన్నగా తరిగినవి)
బియ్యం - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
పాలు - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
జీడిపప్పు, కిస్ మిస్ లు - సరిపడా (నేతిలో వేయించి పెట్టుకోవాలి)
తయారుచేసే పద్ధతి :
బియ్యాన్ని అరటీస్పూన్ నెయ్యిలో దోరగా వేయించి, గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు వడకట్టి పేస్ట్ లా రుబ్బి, పాలు కలిపి పక్కనుంచాలి. పొట్లకాయ ముక్కల్ని ఆవిరిపై ఉడికించి, మిగిలిన నేతిలో కొద్దిసేపు వేయించి పాలమిశ్రమాన్ని పోసి బాగా కలుపుతూ పది నిమిషాలపాటు చిన్న మంటపై ఉడికించాలి. పంచదార వేసి కరిగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు, కిస్ మిస్ లతో అలంకరించుకోవాలి.