బియ్యప్పిండి-ఒక కప్పు,
మినప్పిండి-ఒక చెంచాడు,
బెల్లం-అర కప్పు,
వెన్న-ఒక చెంచాడు,
నువ్వులు-రెండు చెంచాలు,
కొబ్బరి తురుము-ఒక చెంచాడు,
యాలక్కాయల పొడి-అరచెంచా,
నూనె-వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
పొయ్యి మీద మూకుడు పెట్టి బియ్యప్పిండిని కాసేపు వేయించాలి. రంగు మారిపోకుండా జాగ్రత్త పడాలి. దాన్ని ఒక బేసిన్‌లో చల్లారబెట్టుకుని మూకుడులో నువ్వు గింజలను, తురిమిన కొబ్బరిని దోరగా వేగించుకోవాలి. బియ్యప్పిండిలో వీటితోపాటు మినప్పిండి, వెన్న వేసి కలపాలి. వేరే మూకుడులో తురిమిన బెల్లాన్ని వేసి, కాస్త నీరు పోసి కరగపెట్టాలి. దీనికి యాలకల పొడిని కలిపి పాకం రానివ్వాలి. పొయ్యి ఆపేసి, ఈ పాకంలో ముందు తయారుచేసి పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని ఉండ కట్టకుండా కలుపుతూ పొయ్యాలి. ఇది చపాతీ పిండిలా తయారయ్యాక గోళీకాయల సైజులో చిన్నచిన్న ఉండల్లా తయారుచేసుకోవాలి. పేపరు మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. ఈలోగా నూనె మరిగించుకుని వాటిని దోరగా వేగించాలి. మరీ వేడి నూనెలో వెయ్యకూడదు. అలావేస్తే ఉండలు విచ్చిపోవచ్చు, లేదా లోపల పచ్చి ఉండిపోవచ్చు. దోరగా వేగిన వాటిని బైటికి తీసి ఆరనివ్వాలి. వేగుతున్నప్పుడు వీటి మీద పగుళ్లు రావడం మామూలే.