బంగాళాదుంపలు-4,
పంచదార-100గ్రా.
యాలకులు-4,
పాలకోవా-ఒక కప్పు
నెయ్యి-100గ్రా,
పచ్చకర్పూరం-కొద్దిగా
తయారుచేసే విధానం
- బంగాళాదుంపలు కడిగి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తరువాత తొక్కలు వొలిచి మెత్తగా రుబ్బాలి.
- ఈ రుబ్బిన ముద్దను ఒక గరిటె నెయ్యి వేసి ఉంచుకోవాలి.
- వేయించిన దుంపల ముద్దలో పాలకోవాను ముందుగా తయారుచేసి ఉంచుకోవాలి. వేయించిన దుంపల ముద్దలో పాలకోవా వేసి కలిపి ఉంచుకోవాలి.
- ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు కొద్దిగా పోసి తీగపాకం వచ్చే వరకు స్టవ్‌మీద ఉంచి, తరువాత రెండూ కలిపి ఉంచుకున్న ముద్దను ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి, యాలకులపొడి, పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలపాలి. మూత ఉంచి అరగంట తరువాత తియ్యాలి. ఇది చాలా బాగుంటుంది. వెరైటీగా కూడా ఉంటుంది.