
కొబ్బరి తురుము - 22(గా.
కోవా - 20(గా.
యాలకుల పొడి - ఒక టీ స్పూన్,
నెయ్యి - ఒక స్పూన్,
చక్కెర - 2 1/2 కప్పులు,
బాదం పప్పులు - 10
తయారు చేసే విధానం :
కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము, కోవాను వేయించాలి. అందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో చక్కెర వేసి కొన్ని నీళ్ళు పోసి పాకంలా తయారు చేయాలి. దీంట్లో ముందు వేయించుకున్న కొబ్బరి కోవాను, బాదంపప్పును కలపాలి. కొద్దిగా గట్టి పడేంతవరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఆ మిశ్రమాన్ని పోయాలి. చల్లారాక కత్తితో మనకు నచ్చిన రీతిలో కట్ చేయాలి. తియ్యటి బర్ఫీ మన ముందుంటుంది.