సేమ్యా - కప్పు
పంచదార - ముప్పావు కప్పు
యాలకులు - 3
నెయ్యి - అరకప్పు
జీడిపప్పు - పది
తయారుచేసే పద్ధతి :
- మొదట యాలకుల్ని పొడి చేయాలి.
- బాణలిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టాలి.
- తరువాత అందులోనే సేమ్యా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
- మిక్సీలో పంచదార వేసి పొడి చేయాలి. తరువాత చల్లారిన సేమ్యా కూడా వేసి పొడి చేయాలి. ఇప్పుడు ఈ రెండు పొడులనూ కలపాలి.
- ఇందులో కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి లడ్డుల్లా చుట్టి వేయించిన జీడిపప్పును అతికించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం