అరటి పండు గుజ్జు - రెండు కప్పులు
కొబ్బరి తురుము - రెండు కప్పులు
చక్కెర - రెండు కప్పులు
పాలు - రెండు కప్పులు
యాలకుల పొడి - అర చెంచ
కేసరి రంగు - చిటికెడు
నెయ్యి - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- కొబ్బరి తురుములో పాలు పోసుకుంటూ బాగా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకొని చక్కెర, అరటి పండు గుజ్జు కలపాలి. దీన్నంతా మరో వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని సన్నటి మంటపై పెట్టాలి. కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే కాసేపటికి మిశ్రమం అంతా దగ్గరపడుతుంది. అందులో యాలకుల పొడి కూడా వేసి ఓ సారి కలిపి దింపేయాలి. వేడి చల్లారాక ఉండల్లా చుట్టుకుంటే సరిపోతుంది.
మూలం : ఈనాడు వసుంధర