గుడ్లు - మూడు,
కోవా - ఒక కప్పు,
నెయ్యి- ఒక టేబుల్ స్పూన్,
పంచదార - అరకప్పు,
డ్రైఫ్రూట్స్ (తరిగి) - ఒక టేబుల్ స్పూన్,
ఆకుపచ్చ యాలక్కాయ పొడి - ఒక టీస్పూన్,
పాలు - అరకప్పు.
తయారీ:
ఒక గిన్నెలో గుడ్లు కార్చి అందులో కోవా, పంచదార, పాలు పోసి పంచదార కరిగే వరకు గిలక్కొట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి కరిగించాలి. ఇందులో గుడ్ల సొన మిశ్రమాన్ని పోయాలి. గుడ్ల సొన ఉడికే వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. గిన్నెకు పదార్ధం అంటుకోకుండా ఉండేంతవరకు వేగించాలి. ఆ తరువాత స్టవ్ మీద నుంచి గిన్నెను దింపి డ్రైఫ్రూట్స్, యాలక్కాయ పొడి వేయాలి. వేడివేడిగా ఎగ్ హల్వాను తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని పరాఠా, పూరీ, చపాతీల్లో తిన్నా కూడా బాగుంటుంది.