మినప్పప్పు : 300 గ్రాములు
బెల్లం : 300 గ్రాములు
బియ్యం పిండి : 150 గ్రాములు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
తయారుచేసే పద్ధతి
ముందుగా మినపప్పును బాగా మెత్తగా ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. పది నిమిషాలు ఉడికిన పప్పును ఆరబెట్టి తర్వాత మెత్తని పొడిలా కొట్టుకోవాలి. ఈ పిండిలో బెల్లంను వేసి సరిపడా నీటితో బాగా కలుపుకోవాలి. బెల్లం, పిండి మిశ్రమంలో నెయ్యి, బియ్యం పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని పూరీల్లా రుద్దుకుని పక్కన బెట్టుకోవాలి. ఆ పూరీలను పాన్‌లో ఇరువైపులా నెయ్యితో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.