కండెన్స్డ్ మిల్క్ - ఒక టిన్;
పాలు - ఒకటిన్నర కప్పులు;
కార్న్ ఫ్లోర్ - టీ స్పూన్;
సిట్రిక్ ఆసిడ్ - అర టీ స్పూను;
ఏలకులపొడి - టీ స్పూన్;
నెయ్యి - టేబుల్ స్పూన్;
ఫుడ్ కలర్ (పసుపు రంగు) - నాలుగు చుక్కలు
తయారుచేసే పద్ధతి :
- పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి కరిగించాలి కండెన్స్డ్ మిల్క్, పాలు, సిట్రిక్ ఆసిడ్ (కొద్దిగా నీటిలో వేసి బాగా కలపాలి) వేసి కలపాలి
- బాగా దగ్గరపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి
- చిన్నపాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి అందులో కార్న్ఫ్లోర్ వేసి పేస్ట్లా కలిపి, పాల మిశ్రమంలో వేయాలి
- విడివడేవరకు బాగా కలుపుతుండాలి
- రంగునీరు జతచేయాలి
- పెద్ద ప్లేట్లోకి తిరగబోసి పేడాల మాదిరిగా తయారుచేయాలి
- ఏలకులపొడితో గార్నిష్ చేయాలి.