రవ్వ- 200 గ్రాములు
వెన్న- 250 గ్రాములు
పంచదార- 150 గ్రాములు
రోజ్/వెనిలా ఎసెన్స్ - 1/2 టి.స్పూన్
ఉప్పు- చిటికెడు
పాలు- 3 టేబుల్ స్పూన్లు
గుడ్లు- 4
మైదా- 55 గ్రాములు
కిస్మిస్- 50 గ్రాములు
తయారుచేసే పద్ధతి :
కేక్ తయారు చేసుకునే టిన్కు లోపలి వైపు పలుచగా వెన్న రాసి కొద్దిగా పొడి పిండి వేసి లోపలంతా పరుచుకునేలా చేయాలి. లేదా బటర్ పేపర్ వేయాలి. పాన్ వేడి చేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. ఒక గినె్నలో వెన్న, పంచదార కలిపి మృదువుగా అయ్యేవరకు కలపాలి. ఇందులో వేయించిన రవ్వ వేసి బాగా కలపాలి. తర్వాత చిటికెడు ఉప్పు, పాలు, ఒక్కో గుడ్డు కొట్టివేస్తూ కలపాలి. మొత్తం కలిశాక మైదా కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. చివరిగా కిస్మిస్, ఎసెన్స్ వేసి కలిపి కేక్ టిన్నులో పోసి ప్రీ హీటెడ్ ఓవెన్లోపెట్టి 170 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 40- 60 నిమిషాల వరకు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.