తీపి గుమ్మడికాయ తురుము - కప్పు;
క్యారెట్ తురుము - కప్పు;
పంచదార-కప్పు;
నెయ్యి - అరకప్పు;
పాలు - అరకప్పు;
యాలకుల పొడి- టీ స్పూన్;
జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ - 10 గ్రాములు చొప్పున.
తయారుచేసే విధానం :
ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి, అందులో రెండుస్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని దోరగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడెక్కాక గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేర్వేరుగా వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో పాలు, పంచదార వేసి దగ్గరపడే వరకూ ఉడికించాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి, క్యారెట్ తురుముల్ని వేయాలి. ఆ తర్వాత మిగిలిన నెయ్యి వేసి గరిటెతో చిక్కపడే వరకూ తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడే ముందు యాలకుల పొడి కూడా వేసి కలపాలి. దగ్గరపడ్డాక స్టౌ మీద నుండి దించేసి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి అందులోకి ఈ పదార్థాన్ని తీసుకోవాలి. దీనిపైన ముందుగానే వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తాల్ని చల్లాలి. అంతే గుమ్మడి, క్యారెట్ హల్వా రెడీ. దీన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదా బౌల్స్‌లోకి విడిగా వడ్డించీ ఇవ్వొచ్చు. దీనిలో ఐరన్, విటమిన్ సి, ఎ, కె లు పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.