మైదా - కప్పు;
పాలు - అర లీటరు;
మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు;
నూనె - టీ స్పూను;
నీరు - పావు కప్పు;
నూనె - డీప్ఫ్రైకి సరిపడా;
పంచదార - 4 టేబుల్ స్పూన్లు;
ఉప్పు - చిటికెడు;
బాదంపప్పులు - కొద్దిగా;
కుంకుమపువ్వు - చిటికెడు;
ఏలకులపొడి - పావు టీ స్పూను
తయారి:
- ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి
- కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్డ్ మిల్క్ పోయాలి
- చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి
- పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి
- ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి
- పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి
- పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి
- గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి.