పాలు-లీటరు;
పంచదార -100 గ్రాములు;
యాలకుల పొడి - టీస్పూన్;
కుంకుమపువ్వు - కొద్దిగా;
పిస్తా -8 (గార్నిష్ కోసం)
తయారుచేసే విధానం :
ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి స్టౌపై పెట్టి బాగా కాయాలి. పాలు చిక్కబడే వరకూ కలుపుతూ మరగనివ్వాలి. చిక్కపడ్డాక అందులో పంచదార వేసి కరిగే వరకూ బాగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉంచి, పాలు చిక్కబడే వరకూ తిప్పుతూ ఉండాలి. తర్వాత కుంకమ పువ్వును స్పూన్ పాలల్లో కలిపి పోయాలి. ఇప్పుడు పాలు లేత పసుపు రంగులోకి మారతాయి. బాగా చిక్కపడ్డాక స్టౌ మీద నుంచి దింపి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితే ఉండలు చేయడం కష్టమవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకొని, రెండు అరచేతుల మధ్య ఉంచి బిస్కెట్‌లా వత్తాలి. తర్వాత వీటిపై పిస్తాపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కేసర పేడా రెడీ.