మీడియం సైజ్ చిలగడదుంపలు - మూడు,
తక్కువ కొవ్వు ఉన్న పాలు - ముప్పావు కప్పు,
పంచదార - ఒక టేబుల్‌స్పూన్,
యాలకల పొడి - పావు టీస్పూన్,
కుంకుమపువ్వు - కొద్దిగా (వీటిని ఒక టేబుల్‌స్పూన్ పాలలో కలిపి ఉంచాలి), బాదం, పిస్తా, జీడిపప్పులు - రెండు టేబుల్‌స్పూన్లు (సన్న ముక్కలుగా తరిగి), నెయ్యి - ఒక టీస్పూన్.
తయారీ:
- చిలగడదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- తరువాత వాటిని బయటకు తీసి పొట్టుతీసి మెదిపి పక్కన పెట్టాలి.
- నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి మెదిపిన చిలగడదుంపలు వేసి మూడు నిమిషాలు వేగించాలి.
- తరువాత పాలు, పంచదార, యాలకలపొడి, పావుకప్పు నీళ్లు పోసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి.
- (ఈ మిశ్రమం పొడిపొడిగా కాకూడదు.) చివర్లో కుంకుమపువ్వు, పప్పులు వేసి కలిపితే హల్వా రెడీ.