రైసిన్స్ (కిస్ మిస్ లాగే పెద్దగా ఉండేవి)-50 గ్రా.
చెర్రీలు - 50 గ్రా.
ఆరెంజ్ పీల్ - 25 గ్రా.(ఎండిన కమలా తొక్కల తురుము)
ఎండు ఖర్జూరాలు - 50 గ్రా.
కిస్ మిస్ - 50 గ్రా.
బటర్ లేక వెన్న - 125 గ్రా.
పంచదార - 125 గ్రా.
మైదా - 125 గ్రా.
గుడ్లు - 2
కమలా రసం - 1 కాయ
బేకింగ్ పౌడర్ - అరటీస్పూన్
వెనిల్లా - అర స్పూన్
కేరమెల్ సిరప్ - అర స్పూన్
శొంటి, చెక్క, లవంగం పొడి - పావు టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
కేరమెల్ సిరప్ తయారీకి :
పావుకప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. అది బ్రౌన్ కలర్ లోకి మారి చిక్కబడ్డాక పావుకప్పు మరిగించిన నీటిని కలిపితే కేరమెల్ తయారవుతుంది.
కమలారసంలో డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి వారం పాటు అలాగే ఉంచాలి.
ముందుగా వెన్న/బటర్ లో గుడ్లు కలిపి బాగా కలియబెట్టాలి. తరువాత పంచదార కలపాలి. ఆ మిశ్రమానికి కేరమెల్, వెనిల్లా, ఎసైన్స్, శొంటి, లవంగం పొడి వరుసగా కలపాలి. మైదా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఈ మిశ్రమానికి డ్రై ఫ్రూట్స్ అన్ని కలపాలి. దీన్ని గుడ్లు, కేరమెల్ మిశ్రమంలో కలపాలి. ఈ మొత్తాన్ని నెయ్యి రాసి మైదా చల్లిన కేక్ ట్రేలో వేయాలి. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఒక గంట బేక్ చేయాలి. అంతే నోరూరించే ప్లమ్ కేక్ రెడీ...
మూలం : ప్రజా శక్తి ఆదివారం