మైదా - 250 గ్రా.
గుడ్లు - 3
కోకో పౌడర్ - 3 స్పూన్లు
వెన్న - 200 గ్రా.
పంచదార - 200 గ్రా.
బేకింగ్ పౌడర్ - 2 స్పూన్లు
డార్క్ చాక్లెట్ - 1
వాల్ నట్ పలుకులు - 2 స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
మైదాలో బేకింగ్ పౌడర్ ,కోకో పౌడర్ కలపాలి. డార్క్ చాక్లెట్ సన్నగా తురిమి మైదా మిశ్రమంలో వేయాలి. పంచదార పొడి, వెన్న, కోడిగుడ్లను ఓ పాత్రలో తీసుకొని బాగా గిలక్కొట్టాలి. అందులో మైదా మిశ్రమం వేసి మరో ఐదు నిముషాలు కలపాలి. చివర్లో వాల్ నట్ పలుకులు చేర్చాలి. ఇప్పుడు ఓవెన్ ను 130 డిగ్రీల వేడిలో ముందుగా సిద్దం చేసుకోవాలి. కేక్ పాత్రకు వెన్న రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఇరవై నిముషాలు ఉడికించి తీస్తే సరిపోతుంది.
మూలం : ప్రజా శక్తి ఆదివారం