బ్రౌన్ షుగర్ (ముడి పంచదార ) - పావు కప్పు
మైదా - ఒకటిన్నర కప్పు
బేకింగ్ పౌడర్ - 1 స్పూన్
బేకింగ్ సోడా - 1 స్పూన్
తేనె - ముప్పావు కప్పు
చీజ్ - ముప్పావు కప్పు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఆరెంజ్ తొక్కల రసం - 1 స్పూన్
పైనాపిల్ ముక్కలు - 20
తయారుచేసే పద్ధతి :
అయిదారు పైనాపిల్ ముక్కలు ఉంచి మిగిలిన ముక్కలను జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. మరో గిన్నెలో నెయ్యి, తేనె, చీజ్, పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం, ఆరెంజ్ తొక్కల తురుము వేసి గిలక్కొట్టాలి. ఈ గుడ్డు మిశ్రమం మొత్తాన్ని మైదా మిశ్రమం లో కలపాలి. కేక్ బాక్స్ లో అడుగున పైనాపిల్ ముక్కలు పేర్చాలి. దానిమీద జాగ్రత్తగా కేక్ మిశ్రమాన్ని వేయాలి. ఈ పాత్రని ఓవెన్ లో అరగంట బేక్ చేయాలి. కేక్ గోధుమ రంగులోకి మారాక ఓవెన్ లో నుండి బయటకి తీయొచ్చు. చల్లారిన తర్వాత కేక్ బాక్సును ప్లేటు మీద బోర్లించి ముక్కలు కోయాలి. పిల్లలు పైనాపిల్ కేక్ ను బాగా ఇష్టపడతారు.
మూలం : ప్రజా శక్తి ఆదివారం