బాదం - 100 గ్రా.
బొప్పాయి - ఒకటి (మీడియం సైజ్ )
అరటిపండ్లు - రెండు
ఆపిల్ పండ్లు - రెండు
కండెన్స్ డ్ మిల్క్ - 100 గ్రా.
పంచదార - 5 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
చిక్కని మీగడ పాలు - అర లీటర్
జీడిపప్పు, కిస్మిస్ - కొద్దికొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- వేడినీళ్ళలో బాదం పప్పులు వేసి 15 నిముషాలు నాననివ్వాలి. తరువాత పొట్టు తీయాలి.బొప్పాయి పొట్టు కూడా తీసి సన్నగా తరిగి బాదం పప్పుతో పాటు కలిపి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమంలో పావు లీటర్ పాలు పోసి కలిపి పక్కన పెట్టాలి.
- మందపాటి బాణలిలో మిగిలిన పాలు పోసి మరిగించాలి. తరువాత సిమ్ లో పెట్టి బొప్పాయి,బాదం మిశ్రమాన్ని వేసి కలిపి ఓ రెండు నిముషాలు ఉంచాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆపిల్, అరటి పండ్ల ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడ్డాక పంచదార, కండెన్స్ డ్ మిల్క్ వేసి కలపాలి. తరువాత నెయ్యి కూడా వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడింది అనుకున్నాక దించాలి. చల్లారాక నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు,బాదంతో అలంకరించి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం