బీట్ రూట్ - ఒకటి (పెద్దది)
పంచదార - కప్పు
పాలు - 4 కప్పులు
జీడిపప్పు - 10
యాలకుల పొడి - అరటీస్పూన్
నెయ్యి - 2 టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి :
- బీట్ రూట్ తొక్కు తీసి ఓ సారి కడగాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఉడికించాలి. బయటకు తీసాక మిక్సర్ లో వేసి మెత్తని ముద్దలా చేయాలి.
- చిన్న బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి.
- మందపాటి బాణలిలో పాలు పోసి చక్కెర వేసి కరిగించాలి. ఇప్పుడు బీట్ రూట్ ముద్దను వేసి ఉడికించాలి. పాలు బాగా మరిగిన తర్వాత యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం