పెసర పప్పు - కప్పు
బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
చిలగడదుంపలు - 3
నెయ్యి - సరిపడా
యాలకుల పొడి - అరటీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- బాణలిలో పెసర పప్పును వేసి ముదురు రంగులోకి మారే వరకు వేయించాలి. తరువాత అందులోనే రెండు కప్పుల వేడి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి.
- చిలగడదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. ప్రెషర్ పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఉడికించిన పెసర పప్పు వేసి కాసేపు వేయించాలి. తరువాత బియ్యప్పిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకు ఉడికించాలి. ఇప్పుడు చిలగడదుంపలు కూడా వేసి మిశ్రమం చిక్కబడే వరకు ఉంచి దించాలి.
- ఇప్పుడు యాలకులపొడి చల్లి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని మిశ్రమాన్ని కోలాకారంలో చేసుకోవాలి. వీటినే పులీలు అంటారు.
- బాణలీలో నెయ్యి వేసి కాగాక ఈ పులీలను వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం