బొంబాయి రవ్వ - పావు కిలో
పాలు - పావు లీటర్
నీళ్ళు - పావు లీటర్
సెనగ పప్పు - కప్పు
బెల్లం తురుము - కప్పు
యాలకుల పొడి - పావుటీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- సెనగపప్పును నానబెట్టి ఉడికించాలి. తరువాత నీళ్ళు వంపేసి బెల్లం వేసి మరికాసేపు ఉడికించాలి. గట్టిపడ్డ తర్వాత యాలకుల పొడి కూడా వేసి కలిపి చల్లారనివ్వాలి. తర్వాత పూర్ణాలు చేసి పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు, నీళ్ళు పోసి మరిగించాలి. తరువాత ఉప్పు, బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. ఉడికి గట్టిపడ్డ తర్వాత దించి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఒక్కో ఉండనీ అరచేతిలోనే చిన్న పూరీలా వత్తి అందులో పూర్ణం పెట్టి మూసేయాలి. ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీస్తే పాలముంజెలు రెడీ.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం