మైదా పిండి - కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - చిటికెడు
నూనె - సరిపడా
పాకం కోసం:
పంచదార - కప్పు
నీళ్ళు - ముప్పావు కప్పు
యాలకుల పొడి - పావుటీస్పూన్
రోజ్ ఎసెన్స్ - రెండు లేదా మూడు చుక్కలు
కుంకుమ పువ్వు - చిటికెడు
పిస్తా, బాదాం - కొద్దిగా
తయారుచేసే పద్ధతి :
- పంచదారలో నీళ్ళు పోసి పాకం పట్టి ఉంచాలి. మైదా పిండిలో కుంకుమ పువ్వు, నెయ్యి వేసి కలపాలి. తరువాత గోరువెచ్చని నీళ్ళు పోసి మృదువైన పిండిలా కలపాలి.
- పిండిని నిమ్మకాయ సైజ్ ఉండల్లా చేసి పెద్ద పలుచని రొట్టెలా చేయాలి. (కప్పు పిండికి సుమారు నాలుగు రోటీలే వస్తాయి.) ఇలాగే మిగిలినవి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఒక రొట్టె మీద నెయ్యి రాసి పొడి పిండి చల్లాలి.
- తరువాత దీని మీద మరో రొట్టెను పరచాలి. ఇప్పుడు మళ్లీ దీని మీద నెయ్యి రాసి పొడి పిండి చల్లి మరో రొట్టెను పెట్టాలి. ఇలాగే నాలుగూ ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఇప్పుడు వీటిని ఒక వైపు నుండి చాప మాదిరిగా చుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టిన తర్వాత చాకుతో అంగుళం మందం వచ్చేలా కోయాలి. కోసిన వాటిని గుండ్రని బిళ్ళల్లా వచ్చేలా అప్పడాల కర్రతో ఓసారి మృదువుగా వత్తాలి.
- ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీసి పాకంలో వేయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం