ఓట్స్ - కప్పు
తేనె - 2 టేబుల్ స్పూన్లు
పీనట్ బటర్ - టీస్పూన్
పాలు - 2 టేబుల్ స్పూన్లు
చాకొలేట్ బార్ తురుము - పావుకప్పు
పంచదార - టీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- బాణలిలో ఓట్లు వేసి వేయించాలి. అవి మంచి వాసనా వస్తుండగా పీనట్ బటర్, తేనె, పాలు, చాకొలేట్ వేసి తక్కువ మంట మీద మూడు నిమషాలు అంటే చాకొలేట్ కరిగే వరకు ఉంచాలి. తరువాత బాగా కలిపి దించాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి బేకింగ్ కాగితం మీద పెట్టి ఫ్రిజ్ లో పది నిముషాలు ఉంచి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం