గోధుమ పిండి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
నెయ్యి - 100 గ్రా.
యాలకులు - 5
జీడిపప్పు - 25 గ్రా.
బాదం పప్పు - 25 గ్రా.
కొబ్బరి పాలు - 4 కప్పులు
కుంకుమ పువ్వు - రెండు చిటికెలు
నూనె - 50 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- ముందుగా జీడిపప్పును నూనెలో వేయించి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. యలకుఅలను పొడి చేసుకొని పెట్టుకోవాలి.
- స్టవ్ మీద బాణలి పెట్టి గోధుమ పిండిని ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. దోరగా ఎర్రబారిన గోధుమపిండిలో కొబ్బరి పాలు పోసి సన్నని మంట మీద ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత చక్కెర వేసి కలపాలి. అనంతరం యాలకుల పొడి వెయ్యాలి. కాసేపటి తర్వాత నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు, కుంకుమ పువ్వు చేర్చాలి. అంతే కొబ్బరిపాల గోధుమ హల్వా రెడీ.
మూలం : సాక్షి దినపత్రిక