మామిడి పండ్లు - రెండు (పెద్దవి)
పంచదార - 500 గ్రా.
యాలకుల పొడి - టీస్పూన్
నెయ్యి - 6 టీస్పూన్లు
గోధుమ పిండి - 125 గ్రా.
శనగ పిండి - 125 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - కప్పు
జీడిపప్పు - పావు కప్పు
తయారుచేసే పద్ధతి :
- మామిడి పండ్లను బాగా కడిగి, రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద బాణలిలో టీస్పూన్ నెయ్యి వేసి కాగాక, గోధుమ పిండి, శనగ పిండిని వేసి మాడు వాసనా రాకుండా వేయించుకోవాలి.
- ఒక పాత్రలో కొద్దిపాటి నీరు తీసుకొని పంచదార వేసి స్టవ్ మీద ఉంచి ముదురు పాకం వచ్చేవరకు కలపాలి.
- తర్వాత శనగ పిండి, గోధుమ పిండిని వేసి బాగా కలిపి, యాలకుల పొడి కూడా చల్లాలి.
- స్టవ్ కట్టేసి, ముందుగా తీసి పెట్టుకున్న మామిడి రసం, కొబ్బరి తురుమును చేర్చి మరో సరి కలపాలి. నెయ్యి రాసిన వెడల్పాటి పళ్ళెంలోకి ఈ మిశ్రమాన్ని మార్చాలి.
- జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
- చల్లారుతుండగా మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకుంటే రుచికరమైన మామిడి బర్ఫీ రెడీ అయినట్లే.
మూలం : సాక్షి దినపత్రిక