మామిడి పండ్లు - రెండు
పంచదార - ఒక కప్పు
యాలకుల పొడి - టీస్పూన్
కోవా - 150 గ్రా.
మైదా - రెండు కప్పులు
పాలు - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- మామిడి పండ్లను బాగా కడిగి, రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత ఒక బాణలిలో నెయ్యి వేసి స్టవ్ మీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాత్రలో మామిడి పండ్ల రసం, పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి.
- వేయించి పెట్టుకున్న మైదా ఉండలను వేసి నాననివ్వాలి.
- ఫ్రిజ్ లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక