పూతరేకుల కోసం జయా బియ్యం మాత్రమే వాడుతారు. ఇవి చేయడానికి ప్రత్యేకమైన కుండ ఉంటుంది. బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పూతరేకుల కోసమే తయారుచేసిన కుండను బోర్లించి లోపల తాటాకులతో మంట పెట్టాలి. ఫై భాగంలో శుభ్రం చేసిన ఒక చేతి గుడ్డంత వెడల్పు గుడ్డను పలుచగా కలిపిన పిండిలో ముంచి కాలే కుండ మీద పరిచి వెంటనే లాగాలి. అప్పుడు పలుచని రేకులాగా లేస్తుంది. వాటినే పూతరేకులంటారు. చెక్కర, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తో కూడా పూతరేకులు చుట్టవచ్చు. పంచదార, బెల్లంతో రెండు విధాలుగా వీటిని తయారుచేసుకోవచ్చు. రేకులు, యాలకులు కలిపి మెత్తగా పొడి చేసుకున్న పంచదార, కరిగించిన నెయ్యి, బెల్లంతో చేయాలనుకుంటే బెల్లం పొడి చేసుకొని అందులో యాలకుల పొడి కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా తీసుకోవాలి. ఒకటి లేదా రెండు రేకులను పరిచి దానిమీద కరిగించిన నెయ్యి వేసి పంచదార పొడి లేదా బెల్లం పొడి చల్లి చాపలా చుట్టాలి.