క్యారెట్ తురుము - కప్పు
చక్కెర - కప్పు
పాలు - అర లీటర్
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము - కప్పు
జీడిపప్పు పలుకులు - పావుకప్పు
తయారుచేసే పద్ధతి :
- ముందుగా బాణలిలో చెంచ నెయ్యి వేసి, కాగాక క్యారెట్ తురుమును దోరగా వేయించాలి. అలాగే మరో చెంచ నెయ్యి కరిగించి కొబ్బరి తురుమును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పాలు మరిగించాలి. అవి పొంగాక చక్కెర వేసి కరిగేదాకా కలిపి తర్వాత క్యారెట్ తురుము, కొబ్బరి తురుమును వేయాలి. మంట తగ్గించి, మధ్యమధ్యలో కలుపుతూ కొద్దిగా నెయ్యి వేస్తూ ఉంటే కాసేపటికి పాలు దగ్గరికి అవుతాయి. అప్పుడు సన్నగా చేసిన జీడిపప్పు పలుకులు కూడా వేసి కలిపి నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకోవాలి. వేడి చల్లారాక ముక్కల్లా కోసుకుంటే క్యారెట్ బర్ఫీ రెడీ.
మూలం : ఈనాడు వసుంధర