అరటి పండు తొక్క గుజ్జు - ఒక కప్పు,
పాలు - ఒక టేబుల్ స్పూన్,
పంచదార - అర కప్పు,
వేగించిన శెనగపప్పు పొడి - ఒక టీస్పూన్,
యాలక్కాయ పొడి- చిటికెడు,
నెయ్యి, నీళ్లు - ఒక టీస్పూన్.
తయారుచేసే పద్ధతి :
అరటి పండు తొక్కల్ని శుభ్రంగా కడిగి నల్లగా ఉన్న భాగాల్ని తీసేయాలి. తరువాత చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. అవసరమనుకుంటే ఒక టీస్పూన్ నీళ్లు కలపొచ్చు. మందపాటి అడుగు ఉన్న కళాయిలో పంచదార, పాలు పోసి వేడిచేయాలి. పంచదార కరిగిన తరువాత అరటి తొక్క గుజ్జును వేసి కలపాలి. సగం ఉడికిన తరువాత శెనగపప్పు పొడి వేసి కలిపి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివర్లో నెయ్యి వేయాలి.
* ఒక కప్పు గుజ్జు కోసం ఐదు అరటిపండ్ల తొక్కలు కావాలి.