telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

గోధుమ రవ్వ పాయసం 

5/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

గోధుమ రవ్వ            -             ఒక కప్పు 
స్వీట్ కార్న్              -              ఒక కప్పు 
పాలు                     -               ఒక లీటర్ 
చక్కెర                    -               200 గ్రా.
నెయ్యి                    -               అరకప్పు 
బాదం, పిస్తాలు        -                పది 
జీడిపప్పు               -                పది 
యాలకుల పొడి       -                చిటికెడు 

తయారుచేసే పద్ధతి :

                    గోధుమ రవ్వను నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. బాదం పిస్తాలను గంటసేపు నీటిలో నానబెట్టి తీసి తడి లేకుండా తుడిచి వేయించాక సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో పాలు మరుగుతుండగా గోధుమ రవ్వ, చక్కెర, స్వీట్ కార్న్ వేసి పది నిమిషాల పాటు ఉడికించి అందులో తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకులు, నెయ్యి కలిపి దించితే సరి. రుచికరమైన 'గోధుమ రవ్వ పాయసం'  తయార్ !

మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం 

0 Comments

పొట్లకాయ పాయసం 

5/24/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :
పొట్లకాయ ముక్కలు          -            2 కప్పులు (సన్నగా తరిగినవి)
బియ్యం                           -            1 కప్పు 
నెయ్యి                             -             2 టీస్పూన్లు 
పాలు                             -              ఒక కప్పు 
పంచదార                        -              ఒక కప్పు 
జీడిపప్పు, కిస్ మిస్ లు     -              సరిపడా (నేతిలో వేయించి పెట్టుకోవాలి)

తయారుచేసే పద్ధతి :

           బియ్యాన్ని అరటీస్పూన్ నెయ్యిలో దోరగా వేయించి, గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు వడకట్టి పేస్ట్ లా రుబ్బి, పాలు కలిపి పక్కనుంచాలి. పొట్లకాయ ముక్కల్ని ఆవిరిపై ఉడికించి, మిగిలిన నేతిలో కొద్దిసేపు వేయించి పాలమిశ్రమాన్ని పోసి బాగా కలుపుతూ  పది నిమిషాలపాటు చిన్న మంటపై ఉడికించాలి. పంచదార వేసి కరిగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని జీడిపప్పు, కిస్ మిస్ లతో అలంకరించుకోవాలి.

0 Comments

పెసరపప్పు పాయసం 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

పెసరపప్పు               -           ఒక గ్లాస్ 
నీళ్ళు                       -           రెండు గ్లాసులు 
పాలు                       -            రెండు గ్లాసులు 
పంచదార                  -           అర గ్లాస్
యాలకులు               -            రెండు 
జీడిపప్పు                 -            కొంచెం 
కిస్ మిస్ లు             -             కొంచెం 
నెయ్యి                      -            రెండు స్పూన్లు 


తయారుచేసే పద్ధతి :

               పెసరపప్పును నీళ్ళలో మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికాక పాలు పోసి పంచదార వేసి సన్నని సెగపై ఉంచి కలుపుతూ ఉండాలి అది గరిట జారుగా అయినాక జీడిపప్పు కూడా కలపాలి. మీద నుంచి రెండు చెంచాల నెయ్యి వేయాలి. గరిట జారుగానే ఉంచాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లు, యాలక్కాయ పొడి వేసి బాగా కలపాలి. ఇది పాయసంలాగా  చాలా బాగుంటుంది. అమ్మవారి నైవేద్యానికి సులువైన వంటకం.

మూలం : ఆంద్రభూమి సచిత్ర మాస పత్రిక 

0 Comments

గోధుమ బియ్యం పాయసం 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

గోధుమ బియ్యం        -           ఒక గ్లాస్ 
నీళ్ళు                       -           రెండు గ్లాసులు 
పాలు                       -            రెండు గ్లాసులు 
పంచదార                 -            ముప్పావు గ్లాస్
యాలకులు              -            రెండు 
జీడిపప్పు                 -            కొంచెం 
కిస్ మిస్ లు             -             కొంచెం 
నెయ్యి                      -            రెండు స్పూన్లు 

తయారుచేసే పద్ధతి :

              గోధుమ బియ్యాన్ని నీళ్ళలో మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికాక పాలు పోసి గరిట జారుగా ఆరనివ్వాలి. అప్పుడు పంచదార వెయ్యాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లు, యాలక్కాయ పొడి వేసి బాగా కలపాలి. ఇది పాయసంలాగా  చాల బాగుంటుంది. సాయి బాబాకి నైవేద్యముగా పెడితే చాలా బాగుంటుంది.

మూలం : ఆంద్రభూమి సచిత్ర మాస పత్రిక 

0 Comments

జొన్న బనానా కేక్ 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

జొన్న పిండి          -                150 గ్రా.
బేకింగ్ పౌడర్        -                2 స్పూన్లు 
పంచదార పొడి      -                70 గ్రా.
అరటి పండ్లు         -                 3
గుడ్లు                   -                 3
డాల్డా                   -                 అరకప్పు 
పాలు/పెరుగు        -                 అరకప్పు 
వెనిల్లా ఎసెన్స్       -                 కొద్దిగా
ఉప్పు                  -                  పావు స్పూన్ 
వంట సోడా           -                 కొద్దిగా 


తయారుచేసే పద్ధతి :

       జొన్న పిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, వంట సోడా కలపాలి. పంచదార పొడిలో కోడిగుడ్ల సొన, డాల్డా వేసి క్రీమ్ తయారయ్యేలా గిలక్కొట్టాలి. ఇందులోనే జొన్నపిండి మిశ్రమాన్ని చేర్చి బాగా కలపాలి. చివరగా పాలు/పెరుగు, అరటిపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ గిన్నెలో వేసి ఓవెన్ లో అరగంట సేపు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలు చేస్తే చాలు.

మూలం : ప్రజా శక్తి ఆదివారం 
0 Comments

పైనాపిల్ కేక్ 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

బ్రౌన్ షుగర్ (ముడి పంచదార ) - పావు కప్పు 
మైదా                   -                ఒకటిన్నర కప్పు  
బేకింగ్ పౌడర్        -                1 స్పూన్ 
బేకింగ్ సోడా         -                1 స్పూన్ 
తేనె                     -               ముప్పావు కప్పు 
చీజ్                     -                ముప్పావు కప్పు 
నిమ్మరసం           -               2 టేబుల్ స్పూన్లు 
ఆరెంజ్ తొక్కల రసం -              1 స్పూన్ 
పైనాపిల్ ముక్కలు -                20


తయారుచేసే పద్ధతి :

           అయిదారు పైనాపిల్ ముక్కలు ఉంచి మిగిలిన ముక్కలను జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. మరో గిన్నెలో నెయ్యి, తేనె, చీజ్, పైనాపిల్ జ్యూస్, నిమ్మరసం, ఆరెంజ్ తొక్కల తురుము వేసి గిలక్కొట్టాలి. ఈ గుడ్డు మిశ్రమం మొత్తాన్ని మైదా మిశ్రమం లో కలపాలి. కేక్ బాక్స్ లో అడుగున పైనాపిల్ ముక్కలు పేర్చాలి. దానిమీద జాగ్రత్తగా కేక్ మిశ్రమాన్ని వేయాలి. ఈ పాత్రని ఓవెన్ లో అరగంట బేక్ చేయాలి. కేక్ గోధుమ రంగులోకి మారాక ఓవెన్ లో నుండి బయటకి తీయొచ్చు. చల్లారిన తర్వాత కేక్ బాక్సును ప్లేటు మీద బోర్లించి ముక్కలు కోయాలి. పిల్లలు పైనాపిల్ కేక్ ను బాగా ఇష్టపడతారు.

మూలం : ప్రజా శక్తి ఆదివారం 
0 Comments

హనీ కేక్ 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

తేనె                      -               పావు లీటర్ 
వెన్న                    -               అరకప్పు 
ఆరెంజ్ పీల్           -               1 స్పూన్ (కమలా తొక్కల తురుము )
కోడిగుడ్లు              -                3
ఆరెంజ్ జ్యూస్         -               పావు లీటర్ 
మైదా                   -                పావుకిలో 
బేకింగ్ పౌడర్        -                3 స్పూన్లు 
బేకింగ్ సోడా         -                అర స్పూన్ 
ఉప్పు                  -                అర స్పూన్
దాల్చిన చెక్క పొడి -               1 స్పూన్ 
బాదం పొడి           -               అరకప్పు 
తేనె                     -               మరో అరకప్పు 

తయారుచేసే పద్ధతి :

         మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల సొన, తేనె బాగా గిలక్కొట్టి ఉంచాలి. అందులో బాదం పొడి కలిపి ఈ మొత్తాన్ని మైదా మిశ్రమంలో కలపాలి. ముందుగానే ఓవెన్ ను 180 డిగ్రీల సెంటీ గ్రేడ్ దగ్గర వేడి చేసి ఉంచుకోవాలి. కేక్ బాక్సుకి నెయ్యి రాసి మైదాపిండి చల్లి పెట్టుకోవాలి. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి ఓవెన్ లో పెట్టి ముప్పావు గంట సేపు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత ముక్కలు కోసి పైన అరకప్పు తేనె పోస్తే చాలు. హనీ కేక్ రెడీ ...

మూలం : ప్రజా శక్తి ఆదివారం 
0 Comments

చాక్లెట్ కేక్ 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

మైదా                    -               250 గ్రా.
గుడ్లు                    -                3
కోకో పౌడర్            -                3 స్పూన్లు 
వెన్న                    -                200 గ్రా. 
పంచదార              -                200 గ్రా.
బేకింగ్ పౌడర్         -                2 స్పూన్లు 
డార్క్ చాక్లెట్          -                1
వాల్ నట్ పలుకులు -               2 స్పూన్లు 


తయారుచేసే పద్ధతి :

            మైదాలో బేకింగ్ పౌడర్ ,కోకో పౌడర్ కలపాలి. డార్క్ చాక్లెట్ సన్నగా తురిమి మైదా మిశ్రమంలో వేయాలి. పంచదార పొడి, వెన్న, కోడిగుడ్లను ఓ పాత్రలో తీసుకొని బాగా గిలక్కొట్టాలి. అందులో మైదా మిశ్రమం వేసి మరో ఐదు నిముషాలు కలపాలి. చివర్లో వాల్ నట్ పలుకులు చేర్చాలి. ఇప్పుడు ఓవెన్ ను 130 డిగ్రీల వేడిలో ముందుగా సిద్దం చేసుకోవాలి. కేక్ పాత్రకు వెన్న రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఇరవై నిముషాలు ఉడికించి తీస్తే సరిపోతుంది. 

మూలం : ప్రజా శక్తి ఆదివారం 
0 Comments

ప్లమ్ కేక్ 

5/23/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

రైసిన్స్ (కిస్ మిస్ లాగే పెద్దగా ఉండేవి)-50 గ్రా.
చెర్రీలు                  -              50 గ్రా.
ఆరెంజ్ పీల్           -              25 గ్రా.(ఎండిన కమలా తొక్కల తురుము)
ఎండు ఖర్జూరాలు   -              50 గ్రా.
కిస్ మిస్               -              50 గ్రా.
బటర్ లేక వెన్న     -              125 గ్రా.
పంచదార              -              125 గ్రా.
మైదా                    -               125 గ్రా.
గుడ్లు                    -                2
కమలా రసం         -                1 కాయ
బేకింగ్ పౌడర్        -                అరటీస్పూన్ 
వెనిల్లా                 -                అర స్పూన్ 
కేరమెల్ సిరప్       -                అర స్పూన్ 
శొంటి, చెక్క, లవంగం పొడి -      పావు టీస్పూన్ 


తయారుచేసే పద్ధతి :

కేరమెల్ సిరప్ తయారీకి : 

          పావుకప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. అది బ్రౌన్ కలర్ లోకి మారి చిక్కబడ్డాక పావుకప్పు మరిగించిన నీటిని కలిపితే కేరమెల్ తయారవుతుంది. 

కమలారసంలో డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి వారం పాటు అలాగే ఉంచాలి. 
ముందుగా వెన్న/బటర్ లో గుడ్లు కలిపి బాగా కలియబెట్టాలి. తరువాత పంచదార కలపాలి. ఆ మిశ్రమానికి కేరమెల్, వెనిల్లా, ఎసైన్స్, శొంటి, లవంగం పొడి వరుసగా కలపాలి. మైదా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఈ మిశ్రమానికి డ్రై ఫ్రూట్స్ అన్ని కలపాలి. దీన్ని గుడ్లు, కేరమెల్ మిశ్రమంలో కలపాలి. ఈ మొత్తాన్ని నెయ్యి రాసి మైదా చల్లిన కేక్ ట్రేలో వేయాలి. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఒక గంట బేక్ చేయాలి. అంతే నోరూరించే ప్లమ్ కేక్ రెడీ...


మూలం : ప్రజా శక్తి ఆదివారం 
0 Comments

గవ్వలు 

5/20/2013

0 Comments

 
కావలసిన పదార్థాలు :

గోధుమ పిండి        :           పావుకిలో 
బెల్లం                   :           పావుకిలో 
నూనె                  :            పావుకిలో 
ఉప్పు                 :            తగినంత 


తయారుచేసే పద్ధతి :
 
          గోధుమ పిండిలో ఉప్పు వేసి పూరీ పిండి మాదిరిగా కలిపి ఒక గంట నాననివ్వాలి. అంతలో ఒక గిన్నెలో బెల్లం, కొన్ని నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. గవ్వలు తయారుచేసే స్పూన్ లేదా పీటపై గోలి సైజ్ పిండి తీసుకొని గవ్వలుగా చేసుకోవాలి. మూకుట్లో నూనె కాగాక గవ్వలు కొన్ని వేసుకొని ఎర్రగా వేయించి చల్లారక బెల్లం పాకంలో వేసుకుంటే సరి.

మూలం : ఆదివారం ఆంధ్రప్రభ 
0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    పాల పేడా
    ఆలూ హల్వా
    జామ హల్వా
    ఎగ్ హల్వా
    పాల బ్రెడ్ హల్వా
    పాల ముంజెలు
    గుల్ గూలె
    రవ్వ కేక్
    పాల్ పోలీ
    మినీ కాజా
    బీట్ రూట్ హల్వా
    బీట్ రూట్ పాయసం
    అరటి ఉండలు
    పెసర లడ్డు
    ఖీర్ మోహన్
    తీపి అప్పం
    రవ్వ లడ్డు
    రవ్వ కేసరి
    మైదా కుట్చి
    రైస్ మిట్టా
    చక్ర పొంగలి
    బటర్ స్కాచ్ బర్ఫీ
    పెసర లడ్డూలు
    కోవా లడ్డులు
    సజ్జ ముద్దలు
    కోవా నువ్వుల లడ్డు
    అరటి తొక్కతో హల్వా
    తీపి ఉండ్రాళ్లు
    హల్వా
    కద్దూ కా ఖీర్‌
    స్టఫ్ డ్ గులాబ్ జామ్
    ఆమ్లా ఖీర్
    మూగర్ పులీ
    గోధుమ రవ్వ పాయసం
    గోధుమ హల్వా
    ఆపిల్ పాయసం
    బేసన్ బర్ఫీ
    ఉసిరి పాయసం
    జొన్న బనానా కేక్
    జొన్న బనానా కేక్
    చూర్ణ లడ్డూలు
    పనీర్ కలాకండ్
    పులుగం
    కేసర్‌ పేడా
    ఆరెంజ్ కేక్
    సొరకాయ హల్వా
    యాపిల్ హల్వా
    సేమియా కేసరి
    ఖర్జూర పాయసం
    మామిడి లడ్డు
    అటుకుల పాయసం
    అటుకుల కేసరి
    సేమ్యా లడ్డు
    అటుకుల లడ్డు
    మామిడి బర్ఫీ
    ఆవిల్‌ ఖీర్‌
    సేమ్యా కేసరి
    ఆరెంజ్ బాల్స్
    చక్కెర పొంగలి
    మిల్క్ మైసూర్ పాక్
    బెల్లం డోనట్స్
    మామిడి రసగుల్లా
    బెల్లం కుడుములు
    బెల్లం రసగుల్లా
    బ్రెడ్ జీడిపప్పు హల్వా
    ఓట్స్‌- కొబ్బరి హల్వా
    అరిసెలు
    కొబ్బరి
    సటోరియా
    కలకండ్‌
    పురాన్‌ పొలి
    గుమ్మడి రవ్వ కేసరి
    కొబ్బరి కోరు చపాతీ
    కొబ్బరి పాయసం
    పరుప్పు పాయసం
    పన్నీర్ పాయసం
    కొబ్బరి సద్ది
    పుట్నాల పప్పు లడ్డూలు
    ఖర్జూరం లడ్డు..
    కోకోనట్ క్రీమ్ కేక్
    నువ్వుల పూర్ణాలు
    కొబ్బరి బొబ్బట్లు
    నువ్వుల బొబ్బట్లు
    శ్రీఖండ్
    పాలపాయసం
    క్యారెట్ కేక్
    సోరక్కాయ పాయసం
    పైనాపిల్ హల్వా
    పొట్లకాయ పాయసం
    క్యారెట్ బర్ఫీ
    బొప్పాయి హల్వా
    క్యారెట్ సేమియా కీర్
    క్యారెట్ మురబ్బా
    సాబూదాన్ క్యారట్ పాయసం
    చాక్లెట్ పంప్కిన్ బ్రెడ్
    వేరుసెనగ బొబ్బట్లు
    జాంగ్రీలు
    పూతరేకులు
    చిలగడదుంప
    శెనగపప్పు లడ్డు
    చిలగడదుంప హల్వా
    గోధుమరవ్వ ఉండ్రాళ్లు
    క్యారెట్‌-గుమ్మడి హల్వా
    దద్ద్యోజనం
    స్ట్రాబెరీ కేక్
    గుమ్మడికాయ పాయసం
    గుమ్మడికాయ భక్షాలు
    సగ్గుబియ్యం పాయసం
    మొక్కజొన్నపాయసం
    కార్న్‌ప్లేక్స్‌ లడ్డు
    80c3816368
    8237c124fa
    8276cc6caa
    8610b8784a
    8ca04ba74d
    90265c732f
    9345ab6c22
    9355304df2
    95a87d2dd4
    969b6e516e
    9d649010b7
    A5d73421d0
    C2424650fd
    C2c38940ea
    C71667ccab
    D921ab6dd1
    Dc2cfa4dc1
    Ddfa844233
    E176abfba7
    E5b5e78e15
    E5da439130
    F5d6e3be0e
    F5fa18e27d
    F69387bcb0
    F7f191d0c1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.